Telugu Desam Party’s former working president and legislator Revanth Reddy on will join the Congress party, a fortnight after rumours began that he had met Congress leaders to negotiate his entry.
తెలంగాణ ఉద్యమం కారణంగా 2014 ఎన్నికల్లో టీడీపీ ఆటుపోట్లకు గురయింది. ఆ తర్వాత ఓటుకు నోటు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిణామంతో మరింత కుదేలయిందని అంటున్నారు. రేవంత్ కారణంగానే తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఇలా ఉందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న రేవంత్ బాటలో పలువురు నేతలు, క్రియాశీలక కార్యకర్తలు నడుస్తున్నారు. వేం నరేందర్ రెడ్డి, రాజారాం యాదవ్, సీతక్క, సుభాష్ రెడ్డి తదితరులు ఆయన వెంట వెళ్తున్నారు.టీడీపీకి కష్టకాలంలోను దిక్కుగా నిలుస్తూ వచ్చిన మండవ వెంకటేశ్వర రావు, అరికెల నర్సారెడ్డి తదితరులు కూడా పార్టీ మారే యోనలో ఉన్నారు. మండవ టీఆర్ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.