Revanth Reddy has praised Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu and AICC president Sonia Gandhi on Monday.
కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధపడిన రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుపై పదేపదే ప్రశంసలు కురిపిస్తున్నారు.
తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించేందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ఆయన పదేపదే చెబుతున్నారు. అదే సమయంలో కొందరు ఏపీ, టీడీపీ నేతలు.. కేసీఆర్ నుంచి లబ్ధి పొందుతున్నారని అందుకే టీడీపీని వీడుతున్నట్లు చెప్పారు.
రేవంత్ పదేపదే చంద్రబాబును ప్రశంసిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలను పక్కన పెడితే, ఈ ప్రశంసలు ఏపీ కాంగ్రెస్‌కు, వైసిపికి ఇబ్బందికర పరిణామాలని చెప్పవచ్చు. నిత్యం బాబుకు కితాబివ్వడం ద్వారా ఏపీ ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు
సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్ రెడ్డి అభిమానులు, అనుచరులతో భేటీ అయ్యారు. ఈ భేటీకి కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. చంద్రబాబును ఆకాశానికెత్తారు. చంద్రబాబుతో పదేళ్ల అనుబంధం కారణంగానే ఆయనను పదేపదే ప్రశంసిస్తున్నారని భావించవచ్చు. అదే సమయంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రశంసించారు.