Smartphones have become such an ubiquitous part of human life that they’re rarely seen out of their owners’ hands – even while sitting on the toilet.
స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతీ ఒక్కరి జీవితాల్లో చాలా స్పేస్ ఆక్రమించుకుంది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు స్మార్ట్ ఫోన్ లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం చాలామందికి కష్టమే. ఆఖరికి టాయిలెట్‌కి వెళ్లినా సరే, మొబైల్ ఫోన్‌ను వెంట తీసుకెళ్తున్నారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల డయేరియా, మూత్ర సంబంధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని లండన్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి చెందిన డా.పాల్ అనే మైక్రోబయాలజిస్ట్ చెబుతున్నారు.