With the ability to bowl yorkers at will during slog overs, young sensation Jasprit Bumrah is Virat Kohli's 'go to man'. After his stunning performances in the 10th edition of the Indian Premier League, the Gujarat lad has taken the ICC Champions Trophy 2017 by storm.
ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న ఇంగ్లాండ్‌లో పిచ్‌లు భిన్నంగా ఉంటాయి. ఇంగ్లాండ్ పిచ్‌లపై బంతి స్వింగ్ అవడం కష్టం. అలాంటి పిచ్‌లపై కూడా టీమిండియా పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించినా, ఆ తర్వాత శ్రీలంక చేతిలో ఓటమిపాలవడంతో భారత బౌలర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు