Preview: Champions Trophy: Semi-final 1: England Vs Pakistan. England take on Pakistan in the first of the ICC Champions Trophy 2017 semi-finals in a knockout of mismatch
ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు కీలక పోరు జరగనుంది. కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్ జట్టుతో పాకిస్థాన్ జట్టు సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మైదానంపై రెండు జట్లకు పట్టుంది. లీగ్ దశలో పాకిస్థాన్ ఇక్కడ రెండు మ్యాచ్ లు ఆడగా, ఇంగ్లండ్ కు ఇది సొంత మైదానం కావడం విశేషం. మ్యాచ్ ఫేవరేట్ గా ఇంగ్లండ్ బరిలో దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు.